For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీరను పైకి లేపి బిగ్‌బాస్ దివి అందాల విందు.. తొలిసారి హాట్ ఫోజులతో... ఇలా మాట ఇవ్వు మామ అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది లోకల్ అమ్మాయిలు వస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే నిలదొక్కుకుని ఆఫర్లను అందుకుంటూ ఉంటారు. అందులో దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి హీరోయిన్‌గా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దివి వాద్యా హాట్ ఫొటోషూట్లతో కుర్రకారు హృదయాల్లో కాక రేపుతోంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

  మహేశ్ బాబు సినిమాతో పాపులారిటీ

  మహేశ్ బాబు సినిమాతో పాపులారిటీ

  ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగల టాలెంట్ ఉన్న అమ్మాయి దివి వాద్యా. ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే ‘లెట్స్ గో', ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మహేశ్ చిత్రం ‘మహర్షి' కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.

  బిగ్ బాస్ ఎంట్రీ.. ఆమె అందానికి ఫిదా

  బిగ్ బాస్ ఎంట్రీ.. ఆమె అందానికి ఫిదా

  మహేశ్ బాబుతో సినిమా చేసిన తర్వాత దివి వాద్యా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుని నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

  బిగ్ బాస్‌తో మారింది.. వరుస ఆఫర్లు

  బిగ్ బాస్‌తో మారింది.. వరుస ఆఫర్లు


  బిగ్ బాస్ షో వల్ల దివి రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

  దివికి చిరంజీవి ఫ్లాట్.. వెంటనే ఆఫర్

  దివికి చిరంజీవి ఫ్లాట్.. వెంటనే ఆఫర్

  బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. దివి వాద్యాను చూసి ఫ్లాటైపోయినట్లు తెలిపారు. ఆమె అందానికి తాను కూడా ఫిదా అయ్యానని చెప్పారు. అందుకే తన రాబోయే సినిమా (వేదాళం రీమేక్)లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

  ఫుల్ బిజీగా దివి... ఒకేసారి మూడు

  ఫుల్ బిజీగా దివి... ఒకేసారి మూడు

  మెగాస్టార్‌నే మాయ చేసిన దివికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఓ లవ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోన్న ఈ భామ.. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ నేడు ప్రారంభం కానుంది. అలాగే, ‘లంబసింగి' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లోనూ చేయనుంది. అమ్మడి దూకుడికి అంతా షాకవుతున్నారు.

  చీరను పైకి లేపి దివి అందాల విందు

  చీరను పైకి లేపి దివి అందాల విందు

  సోషల్ మీడియాలో దివి వాద్యా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన.. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఫొటోషూట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో పసుపు రంగు చీరలో ఆమె హాట్ హాట్ ఫొజులతో ఆకట్టుకుంది.

  Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
  అలా మాట ఇవ్వు మావా అంటూ

  అలా మాట ఇవ్వు మావా అంటూ

  దివి వాద్యా తాజాగా షేర్ చేసిన ఫొటోషూట్‌తో పాటు దానికి ఓ కవితను కూడా జత చేసింది. ‘ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట.. నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేరా రావా.. ఇంకనైనా పట్టించు కుంటానని మాట ఇవ్వు మావ... తుర్రుమంటూ పైకెగిరి పోద్ది నా అలక చిటికలోనా' అంటూ రాసుకొచ్చిందామె. దీంతో ఈ పోస్టుకు విశేషమైన స్పందన వస్తుంది.

  English summary
  Divi Vadthya is a very known actress of the south cinema world. She belongs to the modern and well-settled family of Hyderabad. Her parents are educated and support in her career. She enrolled herself into the Jubilee Hills Public School of Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X