For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: గురుదక్షిణ విషయంలో వసుధార మొండి పట్టుదల.. కోపంతో ఊగిపోయిన జగతి

  |

  వసుధార దగ్గరి నుంచి కోపంగా వెళ్లిన రిషి తనను అనవసరంగా అరిచాను, ఫీలైందేమో కానీ.. నా కోపంలో న్యాయం ఉంది అని అనుకుంటాడు రిషి. తర్వాత వసుధాక తనను అర్థం చేసుకోవట్లేదని అనుకుంటూ తన వీడియో ఓపెన్ చేసి చూస్తూ నవ్వుతాడు. రిషి వెనుకే వచ్చిన వసుధార ఆ వీడియో చూస్తుంది. రిషి ఫోన్ లాక్కునేందుకు ట్రై చేస్తుంది.

  నాకు తెలియకుండా నా వీడియో ఎందుకు తీశారని వసుధార అడిగితే.. నా క్యాబిన్ ని వీడియో తీశాను.. క్యాబిన్ లో నువ్వున్నావ్ కాబట్టి నువ్ పడ్డావని రిషి అంటాడు. నేనేం తప్పు మాట్లాడలేదు, మీరు కూడా చాలా సార్లు నన్ను చాలా మాటలన్నారు అని వసుధార అంటుంది. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 8, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 576లో ఏం జరిగిందో చదివేసేయండి.

  ప్రేమకు మించిన ధైర్యం ఏముందని..

  ప్రేమకు మించిన ధైర్యం ఏముందని..

  క్యాబిన్ లో వీడియో గురించి ఇద్దరు వాదించుకుంటారు. ఈ మధ్య నీకు ధైర్యం ఎక్కువైపోతుందని రిషి అంటే ప్రేమకు మించిన ధైర్యం ఏముందని వసుధార రిప్లై ఇస్తుంది. ఎన్ని చెప్పినా నా మాట వినవు కదా అని రిషి అన్నదానికి దానికిబదులు నా మాటే వినొచ్చు కదా సార్ అని వసుధార అంటుంది. దీంతో అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు.

  కట్ చేస్తే ధరణి వంట చేస్తుంటే జగతి వచ్చి పని ఇంకా పూర్తి కాలేదా, హెల్ప్ చేస్తానంటుంది. ఇంకా వెళ్లలేదా అని దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ధరణికి ఏమైనా చెప్పాల్సినవి ఉన్నాయా.. నువ్ అందరి జీవితాలను రిమోట్ లా తెలియకుండా ఏదైనా చేయగలవు జగతి. నేను చెప్పిందాంట్లో తప్పుందా ధరణి. మనిద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మనిద్దరం ఫ్రెండ్స్. మనిద్దరికి రిషి బావండటం కావాలి. కానీ ఇక్కడ వసుధారే సమస్య. వసు-రిషి జంట నాకు నచ్చలేదు.

  పుత్రవాత్సల్యం మిమ్మల్ని భయపెడుతోంది..

  పుత్రవాత్సల్యం మిమ్మల్ని భయపెడుతోంది..

  నువ్ నేను కలిసి రిషికి మంచి జీవితాన్ని ఇవ్వాలి కదా. మంచి సంబంధం చూడాలి కదా. అలా కావాలంటే నువ్ నీ శిష్యురాలిని రిషికి దూరం చేయాలి. ఏమాంటావ్ జగతి. నువ్ మంచి దానివి నాకు తెలుసు. చెప్పినట్టు వింటావ్. మహేంద్రకు కూడా చెప్పాను. ఏం చేస్తావో తెలియదు. రిషి జీవితంలో నుంచి వసుధార దూరంగా వెళ్లిపోవాలి అని అంటుంది దేవయాని. దీంతో ఆలోచనలో పడుతుంది జగతి.

  మరోవైపు రిషి మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర.. తన బాధను చూడలేకపోతున్నాను ఏం చేయాలో తెలియడం లేదు. నీ గురుదక్షిణ ఒప్పందం వద్దు వసుధార. అన్నీ మర్చిపోదాం. అన్నీ వదిలేద్దాం వసుధార. జరుగుతున్న పరిణామాలు చూస్తూ విసిగిపోయాను. నిన్ను ఏం అడగలేదు. నువ్ ఏం ఒప్పుకోలేదు అని వసుధారతో మహేంద్ర అంటాడు. అసలు ఎందుకు భయపడుతున్నారు. రిషి సార్ పై ఉన్న పుత్రవాత్సల్యం మిమ్మల్ని భయపెడుతోంది. గురుదక్షిణ జగతి మేడమ్ కి చెల్లించుకుంటాను అని వసుధార అంటుంది. నీకు పరిస్థితులు అర్థం కావట్లేదు. రిషి పంతం గలవాడు. ఈ కారణంగా మీరిద్దరూ దూరమైపోతారనే భయం అని మహేంద్ర అంటాడు.

  నన్ను గెలిపించావ్, జగతిని కూడా గెలిపిస్తావని..

  నన్ను గెలిపించావ్, జగతిని కూడా గెలిపిస్తావని..

  ఎట్టిపరిస్థితుల్లోనూ రిషి సార్ ను దూరం కానివ్వను. ఇప్పుడు రిషి సార్ కళ్లలో ప్రేమ చూస్తున్నాను. జగతి మేడం విషయంలో రిషి సార్ చాలా మారారు అని వసుధార అంటే రిషిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్ అని మహేంద్ర అంటాడు. రిషి సార్ కన్నా నేను మొండిదాన్ని. రిషి సార్ ప్రేమ మాత్రమే కాదు తన బాధ్యతలు, బరువు కాడూ పంచుకుంటాను.

  తను నా జీవితం. ఎట్టి పరిస్థితుల్లోనూ గురుదక్షిణ చెల్లించి తీరుతాను అని వసుధార అంటుంది. నీ సంకల్పం గొప్పది. నువ్ గ్రేట్. నేను పరీక్షించుకున్నాను నన్ను గెలిపించావ్. జగతిని కూడా గెలిపిస్తావని ఆశిస్తున్నాను అని మహేంద్ర అంటాడు. మరోవైపు రిషిధార గురించి ఇంట్లో ఏమనుకుంటున్నారో ధరణి దగ్గర కూపీలాగే ప్రయత్నం చేస్తుంది దేవయాని. జగతి తన గదిలో కూర్చుని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటే వచ్చి రిపోర్ట్ ఇస్తుంది వసుధార. జగతి ఏదో చెప్పబోతుంటే వసుధార ఫీల్డ్ విజిట్ గురించి చెబుతుంది. దీంతో ఆవేశంగా లేచి నిలబడుతుందు జగతి.

  మ్మా అని పిలవకపోతే తప్పేంటి..

  మ్మా అని పిలవకపోతే తప్పేంటి..

  ఎంతకాలం ఓపిక పట్టాలి. అసలేం జరుగుతోంది మీ ఇద్దరి మధ్యా అని జగతి అంటే.. మేం బాగానే ఉన్నాం కదా అని వసుధార రిప్లై ఇస్తుంది. ఏం బాగున్నారు. ఎక్కడ బాగున్నారు. నువ్ మహేంద్ర కలిసి గురుదక్షిణ ఒప్పందం చేసుకున్నారు కదా. నేను ఇన్నాళ్లు రిషి మనసుకి గాయం కాకూడదనే జాగ్రత్త పడ్డాను. కానీ, నా భయాన్ని నువ్ నిజం చేస్తున్నావ్. నువ్ అసలు ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండేది.

  ఇద్దరు కలిశారు, విడిపోయారు, మళ్లీ కలిశారు.. ఎందుకిలా చేస్తున్నావ్ అని జగతి అంటే మీరేకదా నన్ను ఇక్కడకి రికమండ్ చేసింది. నేనేం చేశానని వసుధార అంటుంది. నీ మొండిపట్టుదల వదులు. రిషి నన్ను అమ్మా అని పిలవకపోతే తప్పేంటి. నువ్ చేస్తోంది అంతకన్నా పెద్దతప్పు. మీ బంధం గురించి ఆలోచించు. నీకు రిషి కోపం గురించి తెలియదని జగతి అంటే కోపం కోపమే.. ప్రేమ ప్రేమే.. అని వసుధార రిప్లై ఇస్తుంది.

  దీంతో స్టాపిట్ అంటూ టైబుల్ పై ఉన్న వస్తువులను విసిరి కొడుతుంది జగతి. దేవయాని మాటలు గుర్తుచేసుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జీవితాలు నాశనం అవుతాయి. నీ మొండితనం తగ్గించుకో అని జగతి అంటుండగా.. మహేంద్ర వస్తాడు.

  English summary
  Guppedantha Manasu Serial October 8 2022 Today Full Episode 576
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X