For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu రిషిని నా నుంచి దూరం చేయకు.. షాక్‌లో వసుధార

  |

  సాక్షితో ఎంగేజ్‌మెంట్‌కు ఉంగరంపై V అని రాయించడంతో రిషి నిశ్చితార్థం బ్రేక్ జరిగింది. అయితే ఆ ఉంగరంపై తన పేరు రాసి ఉండటంతో ఆనందపడిన వసుధార.. V పక్కన మరో R చేర్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు కావాల్సిన డబ్బును ఎలా సిద్దం చేయాలని ఆలోచనల్లో పడింది. అలాంటి సమయంలోనే క్లాస్‌లో బోర్డుపై బంగారు ఉంగరం తయారు చేయడానికి అవసరమయ్యే మొత్తాన్ని రాయడంతో రిషి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వసుధార ఆ సంఘటన తలుచుకొంటూ ఉంటే..సడెన్‌గా రిషి ఎంట్రీ ఇచ్చాడు. గుప్పెడంతా మనసు తాజా ఎపిసోడ్ 535 లో ఏం జరిగిందంటే..

  రిషి సార్ మీరు చెప్పకుండా వచ్చేశారేంటి? అని వసుధార అంటే.. ఇంటికి వెళ్లి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని వస్తాను అంటూ రిషి సెటైర్ వేశాడు. అయితే నీవు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువుపైనే దృష్టిపెట్టు అని చెబుతూ.. మెడలో గొలుసు లేకపోవడం చూసి.. ఆ తాడు ఏమిటి అని అడిగాడు. దాంతో ఏమి లేదు అంటూ సర్ది చెప్పబోయింది. అయితే వసుధార చేతిలో డబ్బులు పెట్టి.. ఇంకోసారి ఏమైనా డబ్బు కావాల్సి వస్తే.. నన్ను అడుగు. మరెవరిని అడగకు అని రిషి చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వసుధార గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.

  అయితే అంతలోనే గౌతమ్ వచ్చి.. రిషి మూడ్ బాగున్నది. వసుధార గురించి మాట్లాడుదాం అని అనుకొంటుండగా.. ఆమె ఫోన్ చేసింది. దాంతో ఎక్కుడున్నావు అంటే.. రిషి సార్ ఇంటిలోనే ఉన్నానని చెప్పింది. అయితే వసుధార రావడంతో ధరణి చూసి.. కాఫీ పెట్టిస్తాను ఉండు అంటే.. ఆమె కాలేజ్ స్టూడెంట్.. అందరికి కాఫీ పెట్టించడం ఎందుకు అని చెప్పింది. వసుధారతో మాట్లాడుతూ.. ఇంటికి రావడం ఎందుకు? ఏదైనా ఉంటే కాలేజ్‌లో కలుసుకోండి అని దేవయాని అంటే.. రిషి సార్ రమ్మని అన్నాడు అని చెప్పడంతో దేవయాని కంగారు పడ్డింది.

  Highlights in Guppedantha Manasu Serial Today Episode August 22th

  ఇక వసుధార, రిషి మనసులో ఏమున్నదో తెలియడం లేదని జగతి, మహేంద్ర చర్చ పెడితే.. అక్కడికి గౌతమ్ వచ్చి.. వారి గురించి మీరు కంగారు పడకండి. ఇప్పుడే ఇంటికి వచ్చింది అని చెప్పాడు. ఏంటి.. ఇంటికి వచ్చి కలువకుండా వెళ్లావేంటి అని అంటే.. రిషి సార్ ఓ పని చెప్పాడు. అందుకే వచ్చాను అని వసుధార చెప్పింది. దాంతో ఏదైనా విషయాలు ఉన్నా పక్కన పెట్టు.. చదువుపై దృష్టిపెట్టు. నీ లక్ష్యాన్ని చేరుకో అంటూ జగతి సలహా ఇచ్చింది.

  అలా నడుచుకొంటూ వెళ్తుంటే.. సాక్షి ఎదురుపడి.. ఎలా ఉన్నావు అంటే.. బాగున్నాను అంటూ వసుధార సమాధానం ఇచ్చింది. అయితే రిషి సార్ చేయించిన ఉంగరం ఏది అంటే.. నీవు బంగారం లాంటి రిషిని వద్దనుకొన్నావు. ఇక ఉంగరం గురించి ఎందుకు? ఇంత జరిగినా నీకు తత్వం బోధపడలేదనుకొంటా అని వసుధార సూటిగా చెప్పింది. దాంతో రిషి కాకి బంగారం అని సాక్షి అంటే.. నీకు రిషి సార్ గురించి మాట్లాడే అర్హత లేదు. నీ పెళ్లి జరిగితే ఫోన్‌లో శుభలేఖ పంపించు అని వసుధార ఘాటుగా స్పందించింది.

  Highlights in Guppedantha Manasu Serial Today Episode August 22th

  ఇక కాలేజీలో రిషి కారు కనిపించడంతో చూసి.. అక్కడకు వెళ్లి.. ఎలాగు రిషి సార్ మాట్లాడనివ్వడు. ఆయన కారుతోనే మాట్లాడుతాను అంటూ.. మీరు ఎదుటి వాళ్లను మాట్లాడనివ్వరు. మీ మనసులో ఏముందో చెప్పరు. మీరు జెంటిల్మన్. మీరు సీరియస్ సింహం, ప్రిన్స్ అని ఫీలవుతారు. మీరు ఎదురుగా టపటపా ప్రశ్నలు అడుగుతాను అంటూ.. తనలో తాను మాట్లాడుకొంటుంటే.. రిషి చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రిషిని చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా? కారు వెనుక ఏం చేస్తున్నారు అంటూ తత్తరపడింది.

  తాజా ఎపిసోడ్ ప్రోమోలో.. రిషిని గౌతమ్ నిలదీస్తూ.. వసుధారను నీవు ప్రేమిస్తున్నావు కదా. మీరిద్దరూ విడిపోతే.. మళ్లీ కలిసే అవకాశం ఉండదు అని గౌతమ్ అంటే.. ఓ సమస్య వచ్చింది. దానంతట అదే పరిష్కారం అవుతుంది అని రిషి అంటే.. కాకపోతే అని గౌతమ్ అంటే.. కాకపోతే కాకపోని అని రిషి ఘాటుగా సమాధానం చెప్పాడు. అయితే ఆ మాట విన్న వసుధార.. అమ్మవారి వద్దకు వెళ్లి.. రిషిని నా నుంచి దూరం చేయకు అని వేడుకొన్నది.

  English summary
  Guppedantha Manasu Episode 535
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X