Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Indian Idol final: షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ విషెస్... అర్జున్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటంటే!
ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది గాయకులకు పరిచయం చేసిన ఇండియన్ ఐడల్ ద్వారా సంగీత ప్రపంచానికి త్వరలోనే మ్యూజిక్ సెన్సేషన్ పరిచయం కాబోతున్నది. ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫైనల్ ఆగస్టు 15వ తేదీన ఉత్కంఠగా జరగబోతున్నది. ఈ ఫైనల్ పోటీలో టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్లు పోటీ పడబోతున్నారు. ఆరుగురు కంటెస్టెంట్లు పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, షణ్ముఖ ప్రియ మధ్య పోటీ ఉత్కంఠగా జరగబోతున్నది. అయితే టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్న షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ సపోర్ట్‌గా నిలిచారు. షణ్ముఖ ప్రియకు ఎలాంటి సహకారం అందించారంటే..
Recommended Video
వైజాగ్‌కు చెందిన మ్యూజిక్ సెన్సేషన్
ఇండియన్ ఐడల్ షోలో అద్భుతంగా తన టాలెంట్‌తో రాణిస్తున్న షుణ్మఖ ప్రియ వైజాగ్‌కు చెందిన వారు. ఆమె తల్లిదండ్రులు రమాలత, శ్రీనివాస్ కుమార్ ఇద్దరు కళాకారులుగా రాణిస్తున్నారు. తల్లి మ్యూజిక్ టీచర్ కాగా, తండ్రి వీణ, మాండలిన్, గిటార్, కీబోర్డ్, వయోలిన్ వాయిద్యకారుడు. దీంతో చిన్నప్పటి నుంచే మ్యూజిక్, సంగీతంపై ఆమెకు మక్కువ పెరిగింది. కర్ణాటక సంగీతం. జాజ్‌లో షణ్ముఖ ప్రావీణ్యం సాధించింది. తేజం సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం టైటిల్ రేసులో ముందున్నారు.
విజయ్ దేవరకొండ పలకరింపు
అయితే ఇండియన్ ఐడల్ ఫైనల్ పోటీలో వేదికపై షణ్ముఖ ప్రియ ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాయ్ షణ్ముఖ ప్రియ ఎట్లున్నావు అంటూ విజయ్ దేవరకొండ పలకరించారు. ఫైనల్ పోటీ సందర్భంగా నీకు నా లవ్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పగానే షణ్ముఖ ప్రియ, ఆమె తల్లి ఆనందంలో మునిగిపోయారు. ఒక్కసారిగా విజయ్ దేవరకొండ కనిపించడంతో ఆమె షాక్ గురై సంతోషం పట్టలేకుండా ఉన్నారు. షణ్ముఖ ప్రియ తల్లిని కూడా విజయ్ దేవరకొండ పలకరించారు. షణ్ముఖ ప్రియ పాడుతుంటే మీరు లిప్ సింక్ చేసి పాడుతుంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తానని విజయ్ దేవరకొండ అనగానే.. షోలో ఉన్నవాళ్లంతా చప్పట్లతో మార్మోగించారు.
గెలుపు ఓటములు వదిలేయ్?.
షణ్ముఖ ఈ రోజు (ఆదివారం) ఫైనల్ జరగబోతున్నది. గెలుపు ఓటములు గురించి పట్టించకోవద్దు. నీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ.. ఫైనల్ పోటీని ఎంజాయ్ చేయి. నీ జీవితానికి సరిపడే అనుభూతిని సొంతం చేసుకో. ఈ ఫోటీలో పాల్గొంటున్న ప్రతీ కంటెస్టెంట్‌కు, వారి పేరెంట్స్‌కు, జడ్జీలకు, నా విషెస్ అంటూ షణ్ముఖ ప్రియను విజయ్ దేవరకొండ చిల్ చేశారు. దాంతో షణ్ముఖ ప్రియ, జడ్జీలు ఆనందంలో మునిగిపోయారు.
నా సినిమాలో నీకు పాడే అవకాశమిస్తున్నా
అంతేకాకుండా షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్ ఇచ్చారు. నీవు విజయం సాధిస్తున్నావు. గెలుపుతో హైదరాబాద్‌కు వస్తున్నావు. నీవు నన్ను కలుస్తున్నావు. నీకు నేను నా సినిమాలో పాడే ఛాన్స్ ఇస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పగానే షణ్ముఖ ప్రియ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ తర్వాత మై గాడ్ అంటూ గట్టిగా అరిచింది. పక్కనే ఉన్న జడ్జీ మాట్లాడుతూ.. షో ముగియకముందే షణ్ముఖ ప్రియకు ఆఫర్ వచ్చింది అంటూ కామెంట్ చేశాడు.
|
విజయ్ దేవరకొండ సపోర్ట్ చేస్తారని అనుకోలేదు..
ఇక విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇది నమ్మబుద్ది కావడం లేదు. నాకు ఇంత సపోర్ట్ వస్తుందని ఊహించలేదు. విజయ్ సార్.. మీరు సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. నా షో చూస్తారని అనుకోలేదు. అందుకు థ్యాంక్స్. ఇక నాకు మాటలు రావడం లేదు అంటూ షణ్ముఖ ప్రియ తాజా ప్రోమోలో వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ విషెస్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవుతున్నది.
షణ్ముఖ ప్రియ గెలువాలంటే..
శనివారం, ఆదివారాల్లో జరుగనున్న తుది రౌండ్ పోటీల్లో షణ్ముఖ ప్రియ తన టాలెంట్‌ను ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. ఈ పోటీలో ఓటు వేసి గెలిపించమని కోరుతున్నారు. సోనీ లివ్ యాప్ ద్వారా, లేదా Firstcry.com వెబ్సైట్ ద్వారా ఓటు వేయమని కోరుతున్నారు. తెలుగు సంగీత ప్రియులు ఓటు వేస్తే తెలుగు తేజం షణ్ముఖ Indian Idol 12 టైటిల్‌ను గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదనిపిస్తున్నది. తెలుగు తేజాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. కాబట్టి షణ్ముఖ ప్రియకు ఓటు వేసి గెలిపించండి.