twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu December 15th: జెస్సి విషయంలో జానకి జాగ్రత్తలు.. మల్లిక దొంగబుద్ధులు!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ఆసక్తిగా మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. జ్ఞానాంబ రెండవ కోడలు మల్లిక అబద్ధపు ప్రెగ్నెన్సీతో ఇన్నాళ్లు ఇంట్లో అందరిని మోసం చేస్తుంటుంది. ఏ పని చేయకుండా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే చివరికి ఆ కడుపు విషయం తెలిసే సందర్భం ఎదురవుతుంది అని కడుపే పోయినట్లుగా అబార్షన్ అయినట్లుగా నాటకం ఆడుతుంది. ఇక ఇంట్లో అందరూ నమ్ముతారు. కానీ జనాకికి ముందే ఆ విషయం తెలిసినప్పటికీ కూడా బయటకు చెప్పదు. ఇక మరోవైపు చిన్న కోడలు జెస్సికి సీమంతం చేయాలని అనుకుంటారు. కానీ ఆమె కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 454 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    ఎవరికి చెప్పకుండా..

    ఎవరికి చెప్పకుండా..

    జానకి ఒకవైపు తన ఐపీఎస్ చదువును కొనసాగిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను కూడా తీసుకుంటూ ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు ప్రతిసారి కూడా ఏదో ఒక ఛాలెంజ్ ఎదురవుతూ ఉంటుంది. జ్ఞానాంబ మూడవ కోడలు జెస్సీకి ఒక సమస్య ఉంటుంది. ఆమె కడుపులో బిడ్డకు సంబంధించిన పెరుగుదల విషయంలో కొంత సమస్యలు ఎదురవుతాయి అని వైద్యులు చెబుతారు. అయితే జానకి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పదు. రామచంద్రకి కూడా తెలుస్తుంది కానీ ఇంట్లో ఎవరికి చెప్పకూడదని ఇప్పుడే చెబితే బాధపడతారు అని అనుకుంటారు. అసలే మల్లికకు అబార్షన్ అయ్యిందని బాధపడుతున్న ఫ్యామిలీకి ఈ విషయాన్ని చెప్పి మరింత టెన్షన్ పెట్టకూడదని ఆలోచిస్తారు. అందుకు రామచంద్ర కూడా సరే అని ఒప్పుకుంటాడు. కానీ అతను నిత్యం జెస్సి విషయంలో బాధపడుతూ ఉంటాడు.

     జ్ఞానాంబకు రిపోర్ట్స్ ఇచ్చిన నర్స్

    జ్ఞానాంబకు రిపోర్ట్స్ ఇచ్చిన నర్స్

    అయితే వైద్యులు జెస్సికి మరోసారి పరీక్షలు చేయడంతో టెస్ట్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంటికి పంపించడం జరుగుతుంది. వైద్యులు ప్రత్యేకంగా జానకికి ఫోన్ చేసి రిపోర్ట్స్ మీ ఇంటికే నర్స్ చేతో పంపించాను అని చెబుతారు. 80 శాతం అయితే నమ్మకం లేదని మా ప్రయత్నం మేము చేస్తామని డాక్టర్ చెబుతుంది. అయితే ఆ రిపోర్ట్స్ ఇంట్లో వాళ్లకు చూస్తే మళ్ళీ అందరూ అసలు విషయం తెలిసి బాధపడతారు అని జానకి వారికి తెలియకుండా ఉండాలి అని అనుకుంటుంది. అయితే నర్స్ రాగానే డైరెక్ట్ గా జ్ఞానాంబ చేతికి రిపోర్ట్స్ ని ఇస్తుంది. డాక్టర్ ఏమన్నారు రిపోర్ట్స్ లో ఏముంది అని అడుగుతుంది. అయితే డాక్టర్ తనకు ఏమి చెప్పలేదు అని ఆ నర్స్ చెబుతుంది.

    మల్లిక అనుమానాలు

    మల్లిక అనుమానాలు

    ఇక వెంటనే అక్కడికి వచ్చిన జానకి నర్స్ ను పంపించేస్తుంది. ఇక ఇప్పుడే నాకు డాక్టర్ గారు ఫోన్ చేశారు అని అంతా బాగానే ఉంది అని చెప్పినట్లుగా అత్తగారికి చెబుతుంది దీంతో ఆమె జానకి చెప్పింది నమ్మేస్తుంది. ఇక జానకి అలా టెన్షన్ పడుతూ చెప్పడంతో పక్కనే ఉన్న మల్లికకు కొంత అనుమానం పెరుగుతుంది. ఇందులో ఏదో తేడా ఉంది అని జానకి టెన్షన్ పడుతుంది. అంటే తప్పకుండా ఆ రిపోర్ట్స్ లో ఉన్న విషయాన్ని జానకి దాచిపెడుతోంది అని మల్లికా అనుకుంటుంది. తప్పకుండా విషయాన్ని తెలుసుకోవాలని ఆమె జానకి పై ఫోకస్ చేస్తుంది. అయితే జానకి ఒక్కసారిగా మల్లికవైపు తిరిగి చూడగానే ఆమె ఎవరితో మాట్లాడుతున్నట్టుగా నాటకం ఆడుతుంది.

     జానకి వెంట మల్లిక

    జానకి వెంట మల్లిక

    ఇక జానకి సైలెంట్ గా వెళ్లి ఆ రిపోర్ట్స్ ను తన గదిలో బీరువాలో దాస్తుంది. అయితే జానకి అంత జాగ్రత్తగా దాచింది అంటే తప్పకుండా అనుమానించాల్సిందే అని మల్లికా వాటిని తీసుకోవాలని వెళుతుంది. ఇక అప్పుడే పని మనిషి వచ్చి మీరు కదలవద్దు అని పెద్దమ్మ గారు చెప్పారు కదా ఒక దగ్గర కూర్చుండి అని చెప్పడంతో మల్లికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కుటుంబ సభ్యులందరూ రావడంతో సీమంతం వేడుకను మొదలుపెడతారు.

    అఖిల్ ద్వారా సీమంతం

    అఖిల్ ద్వారా సీమంతం

    ముందుగా జెస్సి భర్త అఖిల్ ద్వారా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెబుతారు. అంతే కాకుండా జ్ఞానాంబ సీమంతం గురించి విశేషాలను కూడా తెలియజేస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర తన భార్యకు కూడా ఇలా చేసే సందర్భం ఎంత తొందరగా వస్తుందో అని ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే అందరూ వారి పనుల్లో బిజీగా ఉండగా మల్లిక మాత్రం జానకి దాచిపెట్టిన రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తుంది.

    మల్లిక దొంగతనం

    మల్లిక దొంగతనం

    ఎలాగైనా వాటిని తీసుకొని అందులో ఏముందో తెలుసుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇక సీమంతం వేడుకలో అందరిని దాటుకుంటూ మల్లిక మెల్లగా జానకి గదిలోకి వెళుతుంది. ఇక జానకి దాచిపెట్టిన రిపోర్ట్స్ తీసుకున్న మల్లికా అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది. అయితే మల్లికపై జానకి కూడా కొంత అనుమానం వస్తుంది. వెంటనే ఆమె కనిపించకపోవడంతో తన గదికి వెళ్ళిన జానకి రిపోర్ట్స్ ఉన్నాయో లేవో చూడాలని అనుకుంటుంది. ఇక బీరువా తెరిచి చూడగా అక్కడ రిపోర్ట్స్ కనబడవు. దీంతో జానకి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతుంది. అసలు మల్లిక వాటిని తీసుకొని ఏం చేస్తుంది? అసలు విషయాన్నీ ఇంట్లో చెబుతుందా లేదా? అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial December 15th Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X