For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : ఫలించిన శిల్ప స్కెచ్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సిరి, భరత్ .. ఏమైందంటే?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ 648వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి తన భర్తను ఇల్లరికం తీసుకువెళ్లాలని యోచనలో ఉన్న శిల్ప తన తల్లి ఏం చెబితే అది చేస్తూ ఎలా అయినా వాళ్ళ అందరి మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేయగా తాజా ఎపిసోడ్ లో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే విధంగా ప్రవర్తించింది. ఈ దెబ్బతో నే కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది? కుటుంబ సభ్యుల మధ్య శిల్ప ఎలా దూరం పెంచే ప్రయత్నం చేసింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  స్టాక్ అంతా తెచ్చి ఇంట్లో

  స్టాక్ అంతా తెచ్చి ఇంట్లో

  రఘురాం కుటుంబ సభ్యులు అందరూ అమ్మవారి దర్శనానికి వెళ్లిన సందర్భంగా రఘురాం షాప్ కి పాతిక లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా స్టోర్ రూమ్ లేకపోవడంతో సామాను కొన్నాక వాటిని ఎక్కడ ఎలా స్టోర్ చేయాలి అనే అంశం మీద తర్జనభర్జనలు పడిన అనంతరం ఆ స్టాక్ అంతా ఇంట్లోనే ఉంచాలని, డెలివరీ ఇవ్వాల్సిన సమయానికి తీసుకెళ్లి ఇస్తే సరిపోతుందని నిర్ణయానికి వస్తారు. అలాగే స్టాక్ అంతా తెచ్చి ఇంట్లో పెడతారు.

  దమయంతి కొత్త ప్లాన్

  దమయంతి కొత్త ప్లాన్

  అయితే ఎలా అయినా నా వీళ్ళ ప్రయత్నాలు విఫలం అయ్యేలా చేసి తన తల్లిని ఆనంద పరచాలని శిల్ప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతగా ఆలోచించడం ఎందుకు అమ్మని అడిగితే అసలు విషయం తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతోనే ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఏం చేయాలి అని చెప్పకుండానే ఇండైరెక్ట్గా ఆ సరుకు నాశనం చేస్తే అప్పుడు వాళ్ళందరికీ కోలుకోలేని దెబ్బ తగులుతుందని అప్పుడు విడగొట్టడానికి ఈజీ అవుతుంది అని చెబుతోంది. అయితే ఆ సామాన్లు తగలబెట్టనా అని అడిగితే అది నేను చెప్పను అని ఎలా వీలుంటే అలా చేయమని తెలియ చెబుతుంది.

  నీళ్లు పోసి

  నీళ్లు పోసి

  అయితే ఈ సామాను ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ సామాను పక్కన నిల్చుని ఉండగా సిరి ఒక బకెట్ నీళ్లు తీసుకుని వెళుతూ కనిపిస్తుంది పైన టెర్రస్ మీద నీళ్లు పెట్టి పాప ఏడుస్తుంది అనే ఉద్దేశంతో రూమ్ లోకి వెళ్ళింది, ఇదే సరయిన సమయం అని భావించి వెంటనే శిల్ప హుటాహుటిన డాబా మీదకు వెళ్లి ఆ నీళ్లు మొత్తం సరుకు మీద పడే లాగా పంపుతుంది.

  అంతకు ముందే బస్తాల మీద కప్పిన టార్పాలిన్ కూడా తీసేయడంతో సరుకు మొత్తం తడిసిపోతుంది. అయితే ఇదేంటి ఇలా నీళ్లు కిందకి పోతున్నాయి అని శైలు ఆ బకెట్ నిల్చోబెట్టి ఆలోచిస్తూ ఉండగా సిరి అక్కడికి వస్తుంది. అది ఏంటి నీళ్లు అలా ఒంపేశావు అని అడుగుతుంది. దీంతో నేను ఎందుకు ఒంపుతాను నాకేం అవసరం నీళ్లు వణికిపోతుంటే నేను ఒలుకుతుంటే వాటిని ఆపుతున్నాను అని శైలు అంటుంది.

  అయితే శైలు - సిరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను కావాలని నీళ్లు ఒంపాను అంటావా? అని అడుగుతుంది. అయితే నాకేం తెలుసు అని సమాధానం చెప్పడంతో దూరం పెరుగుతుంది

  ఆమ్మో

  ఆమ్మో

  వీళ్ళు ఇలా గొడవ పడుతున్న విషయం చూసిన సీత హుటాహుటిన అక్కడికి వస్తుంది, విషయం తెలుసుకుని సీత కూడా కూలబడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఈ విషయం బావకు ఎలా చెప్పాలి? అని సీత మధన పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అత్తగారు కోడలిని చేసిన నిర్వాకం చూసి బాధ పడుతుంది ఇంకేం చేస్తాం రఘురామ్ కి ఫోన్ చేయండి ఏం చేయాలో రఘురామయ్య చేసుకుంటాడు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇదే విషయాన్ని ఫోన్ చేసి సీత చెప్పడంతో రఘురాం కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ భారత్ కూడా ఇంటికి చేరుకుంటారు, దీంతో అసలు నీళ్లు ఎలా పడ్డాయి అనే విషయం మీద చర్చ మొదలవుతుంది.. అందరూ సిరి తప్పే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సినిమా మాత్రం తనకు ఏ పాపం తెలియదు అని చెబుతూ ఉంటుంది.

  ఇల్లు వదిలేసిన సిరి, భరత్

  ఇల్లు వదిలేసిన సిరి, భరత్

  అయినా ఎవరికి వాళ్ళు బాధ లో ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు.. దాదాపు పాతిక లక్షల రూపాయలు ఈ సరుకు కోసం ఖర్చు చేశామని లక్షల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తూ ఉండగా ఇలా జరగడం సరిగా లేదని అందరూ బాధపడుతూ ఉంటారు. రఘురామ్ ఐతే ఈ ఆర్డర్ తో నష్టాల నుంచి బయటపడవచ్చని ఉన్నది లేనిది దీని మీద పెట్టి నష్టపోయామని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం అని అంటాడు.

  ఇదిలా జరుగుతుండగా ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో భరత్, సిరి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూపించారు. అయితే ఈ గొడవ కారణంగానే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఏమో అని శైలు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రఘురాం కూడా వారిద్దరి కోసం వెతికే పనిలో పడతాడు మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 648: Shilpa destroys the goods and puts the blame on Siri. Later, Raghuram and Sita accuse Siri for their loss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X