Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వకీల్‌సాబ్‌తో జాతిరత్నం క్రాస్ ఓవర్… నవ్వులే నవ్వులు, డోంట్ మిస్!
తెలుగు సినిమాలలో క్రాస్ఓవర్ టెక్నిక్ చాలా తక్కువగా వాడతారు. సాధారణంగా రెండు సినిమాలకు సంబంధించిన పాత్రలు ఒకే సినిమాలో రూపొందిస్తే దానిని క్రాస్ఓవర్ అంటూ ఉంటారు. తెలుగులో ఈ పద్ధతిని ఫాలో అయి వచ్చిన సినిమాలు పెద్దగా అయితే లేవు. కానీ తాజాగా ఈ ఏడాది రిలీజ్ అయిన రెండు సూపర్ హిట్ సినిమాల సీన్స్ కలిపి ఒక క్రాస్ఓవర్ వీడియో రెడీ చేశారు కొందరు. ఎవరు చేశారో తెలియదు కానీ ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ గా మారింది.
పొట్టిదుస్తుల్లో సల్మాన్ ఖాన్ హీరోయిన్... అలా అందాలను ప్రదర్శిస్తూ..
ఇక ఈ రెండు సినిమాలను కొనుక్కుని ఆన్లైన్లో స్ట్రీమ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దృష్టికి ఈ వీడియో రావడంతో వాళ్లు నేరుగా తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా సైతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో పాటు కంటెంట్ కూడా జనానికి బాగా నచ్చడంతో సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ రెండు సినిమాల్లో కోర్టు సీన్స్ కామన్ గా ఉన్నాయి. ఇప్పుడు అదే కోర్టు సీన్స్ వేదికగా చేసుకుని కొందరు ఔత్సాహికులు ఈ క్రాస్ఓవర్ వీడియో సృష్టించారు. నవీన్ పోలిశెట్టి బోనులో ఉండగా పవన్ కళ్యాణ్ లాయర్ గా ఆయనను విచారిస్తున్నట్లుగా ఈ వీడియో తయారు చేశారు. జాతిరత్నాలు సినిమాలో లాయర్ గా నటించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు స్థానంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా ఈ వీడియో రూపొందించారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.