twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush టీజర్ పై మొదలైన కాంట్రవర్సీ.. ఆ పాత్రపై హోమ్ మంత్రి అభ్యంతరాలు.. లీగల్ యాక్షన్!

    |

    ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ సభ్యులు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీజర్ ఇటీవల యూట్యూబ్లో విడుదల చేశారు. ఇక గ్రాఫిక్స్ విషయంలో వివిధ రకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇది రామాయణం రామాయణం కథ ఆధారంగా తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని పాత్రలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.

    స్టార్ క్యాస్టింగ్

    స్టార్ క్యాస్టింగ్

    ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇక కృతిసనన్ సీతమ్మగా కనిపించబోతోంది. అలాగే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా దేవదత్త హనుమాన్ పాత్రలో నటించారు. పాత్రలతోనే ఈ సినిమా ప్రేక్షకులలో అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. అయితే టీజర్ విజువల్స్ మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

     అప్పుడే మొదలయ్యాయి

    అప్పుడే మొదలయ్యాయి

    అసలైతే ఈ టీజర్ ను ఎప్పుడో విడుదల చేయాల్సింది. ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు చాలా కాలం పాటు ఎదురు చూసారు. దర్శకుడు ఓం రౌత్ అయితే అప్పట్లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గాడు. దీంతో ఈ సినిమాపై ఎక్కువగా అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.

    అభ్యంతరాలు

    అభ్యంతరాలు

    ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో అయితే ప్రభాస్ లుక్ పరవాలేదు కానీ మిగతా ఆర్టిస్టులకు సంబంధించిన లుక్స్ విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

    హోమ్ మంత్రి కామెంట్

    హోమ్ మంత్రి కామెంట్

    ముఖ్యంగా సినిమాలో హనుమాన్ పాత్రలో నటుడు దేవదత్త కనిపించిన విధానంపై కూడా పలువురు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టీజర్ లో హనుమాన్ లెదర్ క్లాత్ వేసుకోవడంతో మత మనోభావాలను దెబ్బతీసినట్లే అని ప్రముఖ మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నారోత్తం మిశ్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.

    చట్టపరమైన చర్యలు

    చట్టపరమైన చర్యలు

    ఇప్పటికే ఆ సన్నివేశాలపై చిత్ర యూనిట్ సభ్యులకి అలాగే దర్శకులకి కూడా ఒక లేఖ రాసినట్లు చెబుతూ వెంటనే ఆ సన్నివేశాలను తీసివేయాలి అని డైరెక్టర్ ను కూడా కోరినట్లుగా ఆయన తెలియజేశారు. ఒకవేళ అతను అలాంటి సన్నివేశాలను మార్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమే అని నారోత్తం తెలియజేశారు.

     సోషల్ మీడియాలో మీమ్స్

    సోషల్ మీడియాలో మీమ్స్


    అయితే కేవలం హనుమాన్ పాత్ర పైనే కాకుండా రావణాసురిడి పాత్ర పై కూడా వివిధ రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. అతని హెయిర్ స్టైల్ స్టైలిష్ గా సెట్ చేయడంపై కూడా రకరకాల మీమ్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పాత్రలను ఎలా డిజైన్ చేశారు అనే విధంగా కూడా కొంతమంది ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

    English summary
    Madya Pradesh home minister objection on adipurush movie scenes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X