Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ సినిమాలో విలన్ పాత్ర.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో నటించాలని ప్రతి ఒక్క స్టార్ కి ఉంటుంది. కొందరు యువ హీరోలు ఆయన సినిమాలో చిన్న పాత్రలు చేయడానికి అవకాశం వచ్చినా సిద్ధంగా ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా యువ హీరో మంచు మనోజ్ త్రివిక్రమ్ సినిమాలో ఒక విలన్ పాత్ర చేయబోతున్నాడు అని ఇటీవల ఒక టాక్ వచ్చింది. ఇండస్ట్రీలో కూడా అందరూ ఈ విషయం చర్చించుకోవడంతో మనోజ్ స్పందించక తప్పలేదు.
పాన్ ఇండియా సినిమాతో..
హీరోగా మళ్ళీ స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని మనోజ్ ఒక పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అహం బ్రహ్మాస్మి అనే కొత్త సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఆ సినిమా కోసం మంచు మనోజ్ చాలా కష్టపడుతున్నాడు. కేవలం ఫిట్నెస్ విషయంలోనే కాకుండా నటనపరంగా కూడా కొత్తగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
త్రివిక్రమ్ సినిమాలో విలన్..?
ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచు మనోజ్ ని ప్రత్యేకంగా కలిసినట్లు ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వచ్చింది. ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదించినట్లు మీడియాలో అనేక రకాల కథనాలు కూడా వచ్చాయి. మనోజ్ పూర్తిగా విలన్ పాత్ర చేయబోతున్నడని కూడా టాక్ వచ్చింది.
క్లారిటీ ఇచ్చిన మనోజ్..
ఫైనల్ గా ఆ రూమర్స్ పై మంచు మనోజ్ వివరణ ఇచ్చాడు. నాకు విలన్ పాత్రలు చేయాలని మనసులో ఉంది.. కానీ ఇప్పుడు చేయాలని లేదని, దానికి ఇది సరైన సమయం కాదని వివరణ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం తనను ఎవరు సంప్రదించలేదని కూడా ఈ మంచు వారబ్బాయి క్లియర్ గా చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చేసింది.
Recommended Video
ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని...
ఇక గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న మనోజ్ ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాలో మంచు మనోజ్ విభిన్నమైన పాత్రలతో సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.