Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కార్తికేయ చాలా హుంబుల్.. 13 తర్వాత పేరు మార్చేస్తారు.. నాని
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ''పది సంవత్సరాలక్రితం వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతోలవ్లోనే ఉన్నాను. మనోళ్ల్లు పాటలకి అబ్రాడ్ వెళ్తుంటారు కానీ ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడుంటుంది చెప్పండి?. 'అష్టాచెమ్మా' కి మూడు రోజుల ముందు ప్రీమియర్ షో ఇక్కడే జరిగింది. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు పూర్తి అయింది . మళ్ళీ 'గ్యాంగ్‌లీడర్' కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇంకా 11 సంవత్సరాలు సేఫ్. సెప్టెంబర్ 13 నుంచి వైజాగ్‌లో ఏ థియేటర్స్‌లో టికెట్స్ దొరకకుండా చూసుకునే బాధ్యత మీదే అని నాని అన్నారు.
'మనం' తరువాత మేము ఒక సినిమా చేద్దాం అనుకున్నాం అది 'గ్యాంగ్‌లీడర్ 'తో కుదిరింది. అలాగే మైత్రి మూవీస్ ఎంతో ఫ్యాషనేట్‌గా ఈ సినిమాను సపోర్ట్ చేసిఎంకరేజ్ చేశారు. సెప్టెంబర్ 13న వారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకీ మా సినిమా రైటర్. అతన్ని విక్రమ్ దగ్గరకు పంపింది నేనే. రేపు థియేటర్స్‌లో మీరు తప్పకుండా నవ్వుకుంటారు. అనంత్ శ్రీరామ్ గారు చాలా అందంగా పాటలు రాశారు అని నాని తెలిపారు.
అనిరుద్ ఆల్రెడీ ప్రపంచాన్ని ఊపేసాడు. అతనితో ఎప్పటికైనా ఒక మూవీ చేయాలనుకున్నాను. కానీ ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తానని అనుకోలేదు. 'జెర్సీ' నా కెరీర్ లోనే ఒక స్పెషల్ మూవీ. ఇప్పుడు మా కాంబినేషన్లో 'గ్యాంగ్‌లీడర్ 'మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. మంచి సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రియాంక మంచి పెర్ఫార్మర్. అలాగే లక్ష్మి గారు, శరణ్య గారి కామెడీ టైమింగ్‌కి మీరు ఫిదా అవుతారు. కార్తికేయ చాలా హుంబుల్గా ఉంటారు. సెప్టెంబర్ 13 తరువాత అందరూ దేవ్ అని పిలుస్తారు. కూబా అందర్నీ లడ్డులా చూపించాడు. మా ఈ సెలబ్రేషన్లో ఇంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిన అందరికి థాంక్స్. మళ్ళీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో కలుద్దాం అని నాని అన్నారు.