twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే..?

    |

    Recommended Video

    NTR 30 : NTR Trivikram Movie To Hit The Screens On Summer 2021 | Filmibeat Telugu

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు చేతిలో ఉన్నాడు. ప్యాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్స్ వాయిదా పడుతూ ఉండటం, అనుకున్న సమయానికి రిలీజ్ కూడా కాదనే ఉద్దేశ్యంతో రీసెంట్‌గా మరో కొత్త డేట్ (జనవరి 8 2021)ను ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మరో చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యాడు.

    అనేక ఊహాగానాలు..

    అనేక ఊహాగానాలు..

    అయితే ఎన్టీఆర్ మరో సినిమాను పట్టాలెక్కించబోతోన్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దర్శకుడు ఇతడే అంటూ ఎంతో మంది పేర్లు వినిపించాయి.అందులో ముఖ్యంగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ పేరు బాగా చక్కర్లు కొట్టింది. అయితే అవన్నీ గాలి వార్తలేనని స్పష్టమైంది. తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

    త్రివిక్రమ్‌తో సినిమా..

    యంగ్ టైగర్, మాటల మాంత్రికుడి కాంబోలో ఇది వరకే అరవింద సమేత సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే మరో సారి వీరిద్దరు కలిసి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు.

    ఆ రెండు సంస్థలు సంయుక్తంగా..

    ఆ రెండు సంస్థలు సంయుక్తంగా..

    త్రివిక్రమ్ సినిమా అనగానే అందులో హారిక అండ్ హాసిని ఉండాల్సిందేనని అందరికీ తెలిసిందే. ఎందుకంటే అది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్. అయితే విచిత్రంగా దీంట్లో కళ్యాణ్ రామ్ కూడా వచ్చి చేరాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్స్‌పై తెరకెక్కే ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్నట్లు ప్రకటించారు.

    టైటిల్ అదేనంటూ ప్రచారం..

    టైటిల్ అదేనంటూ ప్రచారం..

    అయిననూ పోయిరావలె హస్తినకు.. అనే ఓ మాట మహాభారతంలో ఉంటుంది. ఈ టైటిల్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరిట ఈ మధ్యనే రిజిష్టర్ చేయించారు. దీంతో టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టైటిల్ చూస్తే రాజకీయాల చుట్టూ తిరిగేలా కనబడుతుందని కొందరు అంటుంటే.. పూర్తిగా ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గానే త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని మరికొందరు అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Official Announcement NTR Next Project With Trivikram After RRR. This Movie Is Going To Produced By Haarika Haasine And NTR Arts Banners ANd Releasing On 2021 Summer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X