Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నీకోసం ప్రతీరోజూ అది చేస్తాను.. ఐ లవ్యూ డార్లింగ్.. సమంత పోస్ట్ వైరల్..
టాలీవుడ్ క్యూట్ కపుల్ ఎవరంటే.. అందరూ నాగచైతన్య, సమంత పేరు చెబుతారు. రీల్ లైఫ్‌లోనే మంచి భార్యాభర్తలుగా కాకుండా రియల్ లైఫ్‌లోనూ అంతే అన్యోన్యంగా ఉంటూ సరదాగా గడిపేస్తుంటారు. వీలు దొరికనప్పుడల్లా అలా విదేశాలకు షికారుకెల్తారు. ఈ జంట సోషల్ మీడియాలో చేసే హల్ చల్ మామూలుగా ఉండదు. చైతు కాస్త మొహమాటంగానే ఉన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది.
నేడు చై పుట్టినరోజు..
నేడు నాగ చైతన్య పుట్టిన రోజ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మామూలుగా విషెస్ చెప్పినా.. తన భార్య చెప్పే విషెస్ ఎంతో ప్రత్యేకంగానే ఉంటుంది. తన భర్త పుట్టిన రోజున సమంత చేసిన పోస్ట్ కాస్త ఎమోషనల్‌గా ఉండటంతో అది తెగ వైరల్ అవుతోంది.
|
ఐ లవ్యూ డార్లింగ్
‘చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం ప్రతీ రోజూ ప్రార్ధనలు చేస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రోజు రోజుకు నువ్వు చాలా ఎదుగుతున్నావు.. నీకు నువ్వే బెస్ట్ అనిపించుకుంటున్నావు.. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్' అని సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌కు సెలెబ్రిటీల కామెంట్లు..
సమంత చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లే కాకుండా పలువురు సెలెబ్రిటీలు కూడా కామెంట్లు చేశారు. నమత్రా శిరోద్కర్, హన్సిక, రకుల్, అఖిల్, నందినీ రెడ్డి, స్వప్నా దత్ లాంటి వారు నాగచైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా.. తిరిగి వారందరికీ సమంత ధన్యవాదాలను తెలిపింది.
Recommended Video
బర్త్ డే స్పెషల్‌గా నాగ చైతన్య ప్రపంచం..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మరింత రా లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణ కుటుంబంలోని కుర్రాడిలా ఇంట్లో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. బీరువాలో ఉన్న డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నట్లు, ఏదో తెలియని గతం కూడా ఉన్నట్లు, దాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లు ఇలా అతనికి సంబంధించిన భావోద్వేగాలన్నింటిని చూపించాడు.