twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులంటే నవ్వులాటగా మారింది.. నాపై జరిగినపుడు.. శ్రద్ద శ్రీనాథ్ సెన్సేషన్

    |

    Recommended Video

    Ajith's Nerkonda Paarvai Actress Shraddha Srinath On #MeToo || Filmibeat Telugu

    సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అరాచకాలపై తనదైన శైలిలో స్పందించింది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. ఇటీవలే వచ్చిన 'జెర్సీ' సినిమాలో నాని సరసన నటించి ప్రేక్షకులకు సుపరిచమైన శ్రద్ద శ్రీనాథ్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీటూ పై మరోసారి స్పందించింది. ఈ మేరకు తన అనుభవాలు, అభిప్రాయాలు తెలుపుతూ ఆసక్తికరంగా మాట్లాడింది. ఆ వివరాలు చూస్తే..

    కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ కెరీర్ ప్రారంభంలో

    కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ కెరీర్ ప్రారంభంలో

    తెలుగు తెరకు పరిచయం కాకముందే శ్రద్ద శ్రీనాథ్ తన సొంత భాష కన్నడలో యూ టర్న్, తమిళంలో 'విక్రమ్ వేద' సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. తనకిచ్చిన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. శ్రద్ద ప్రధాన పాత్రలో కన్నడలో రూపొందిన 'యూ టర్న్' సినిమాను తెలుగులో సమంతను లీడ్ రోల్‌లో పెట్టి రీమేక్ చేశారు.

    లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి

    లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి

    శ్రద్ద శ్రీనాథ్ తాజా చిత్రం 'నేర్కొండ పార్వాయ్‌'. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించింది శ్రద్ద శ్రీనాథ్. అయితే ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు తన అనుభవాలు ఎలా ఉన్నాయని స్పష్టంగా వెల్లడిస్తూ తాజాగా ఆంగ్ల మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొంది శ్రద్ద శ్రీనాథ్.

    నా థింకింగ్ అంతా అదే..

    నా థింకింగ్ అంతా అదే..

    'నేర్కొండ పార్వాయ్‌' సినిమాలో ఆ పాత్రలో భాగంగా నాపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో నాకు నిర్భయకు సంబందించిన ఆలోచనలే మెదడులో మెదిలాయి. ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుంది? రాక్షకుల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటుంది? ఇవి తప్ప నాకు వేరే ఆలోచనే ఉండేది కాదు అని చెప్పింది శ్రద్ద శ్రీనాథ్.

    అందుకే భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు

    అందుకే భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు

    ఏ అమ్మాయైనా తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పగానే.. ఎలా జరిగింది? అన్నట్లుగా ఆమెనే ప్రశ్నిస్తారు తప్ప నిందితులను మాత్రం ఒక్క మాట కూడా అన్నారు. అందుకే భయపడి ఎవరూ ముందుకు వచ్చి ఇలాంటి సంఘటనలు చెప్పడం లేదు. లైంగిక వేధింపులంటే నవ్వులాటగా మారింది. దీనిపై పార్టీల్లో జోకులేసుకునే దిగజారిన పరిస్థితి వచ్చేసింది.. అని శ్రద్ద పేర్కొంది.

    లైంగిక వేధింపులను నేను తట్టుకోలేను

    లైంగిక వేధింపులను నేను తట్టుకోలేను

    లైంగిక వేధింపులను నేను తట్టుకోలేను. అందులోనూ పిల్లలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటే అసలు భరించలేను. మహిళా సేఫ్టీ, సెక్సువల్ హరాస్మెంట్ తదితర విషయాలపై ప్రతీ వ్యక్తి ప్రతీ రోజు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది అని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది.

    శ్రద్ద శ్రీనాథ్.. తెలుగు సినిమా

    శ్రద్ద శ్రీనాథ్.. తెలుగు సినిమా

    ఇక శ్రద్ద సినిమాలంటారా.. అతి త్వరలో సెట్స్ పైకి రానున్న కొరటాల, చిరు ప్రాజెక్టులో శ్రద్ధకు చోటు దక్కిందని తెలుస్తోంది. ఇందులో మొదటి హీరోయిన్‌గా అనుష్క లేదా నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రెండో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే బడా హీరోయిన్ల నడుమ మెగాస్టార్ చిరంజీవితో చిందులేసే అరుదైన అదృష్టం శ్రద్ద శ్రీనాథ్ సొంతమైనట్లే మరి.

    English summary
    Shraddha Srinath spoke about Sexual abuse, Sexual harassment and #metoo movement in the film Industry. One movie can’t bring in a revolution or suddenly school all the men She said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X