twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Vaccine War.. 11 భాషల్లో వివేక్ అగ్నిహోత్రి మూవీ.. ది కశ్మీర్ ఫైల్స్ తర్వాత మరో సంచలనం

    |

    ది కశ్మీర్ ఫైల్స్ సంచలన విజయం తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించగానే వైరల్‌గా మారింది. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ సినీ అభిమానులను థ్రిల్లింగ్‌కు గురిచేసింది.

    'ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ప్రకటన చేస్తున్నాను. ఈ చిత్రాన్ని నేను సమర్పిస్తున్నాను. భారత్‌లో కరోనాపై జరిగిన పెద్ద యుద్దం నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నది. భారతీయ విలువలు, సైన్స్, ధైర్యం లాంటి అంశాల సినిమా తెరకెక్కిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 11 భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్నది. భారతీయ సినిమా పరిశ్రమ సమగ్రతకు చిహ్నంగా నిలుస్తుంది. #BharatKaApnaCinema అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ది వ్యాక్సిన్ వార్ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 11 భాషల్లో ఆగస్టు 15, 2023 తేదీన రిలీజ్ చేస్తున్నారు.

     The Kashmir Filess Vivek Agnihotris announced The Vaccine War

    ఇదిలా ఉండగా, ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్, అభిషేక్ అగర్వాల్‌తో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. భారతీయ సినిమా పరిశ్రమను ఏకం చేస్తున్నాం. పుష్ప డైరెక్టర్, కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, యూవర్స్ ట్రూలీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాం అని అన్నారు. అంతేకాకుండా వివేక్ అగ్నిహోత్రి ఢిల్లీ ఫైల్స్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

    English summary
    The Kashmir Files's Vivek Agnihotri's announced The Vaccine War. Vivek wrote on Twitter, "ANNOUNCEMENT: Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values. It will release on Independence Day, 2023. In 11 languages. Please bless us.#TheVaccineWar."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X