Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విదేశాల్లోనే ఆ పని చేస్తా.. హీరోనే కావాల్సిన పనిలేదు.. ఓపెన్‌గా చెప్పేసిన త్రిష
సౌత్ సినీ ఇండస్ట్రీలో గత 18 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తూ వస్తోంది త్రిష. తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. సినిమాల సంగతేమో గానీ ఈ మధ్యకాలంలో అమ్మడి పెళ్లి టాపిక్ బాగా హైలైట్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై మరోసారి స్పందించింది త్రిష. వివరాల్లోకి పోతే..
త్రిష కెరీర్ స్లో.. సీక్రెట్స్ చెప్పేసిన బ్యూటీ
గతంతో పోల్చితే త్రిష కెరీర్ స్లో అయింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ తో మత్తెక్కిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది త్రిష. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్'లో నటిస్తున్నఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో కొన్ని సీక్రెట్స్ చెప్పింది.
పెళ్ళి విషయంలో పెద్దల మాట వినేదే లేదు..
గతంలో.. ఇక పెళ్లి చేసుకుంటా అని చెప్పిన త్రిషకు తాజా ఇంటర్వ్యూలో అదే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె.. పెళ్ళి చేసుకుంటానని చెప్పానే తప్ప ఎప్పుడు చేసుకుంటానని చెప్పలేదని బదులిచ్చింది. పెళ్ళి విషయంలో పెద్దలు చెప్పిన మాట వినను అని చెప్పేసింది. పెద్దలు చూసిన వ్యక్తిని మాత్రం చేసుకోనని కుండబద్దలు కొట్టే సమాధానం చెప్పింది.
విదేశాల్లోనే ఆ పని చేస్తా.. హీరోనే కావాల్సిన పనిలేదు
ప్రేమించే చేసుకుంటా.. అదీ విదేశాల్లోనే చేసుకుంటా.. నాకు లాస్ వేగాస్ అంటే చాలా ఇష్టం. కుదిరితే అక్కడే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది త్రిష. ఇక తనకు కాబోయే వాడు హీరోనే అయి ఉండాల్సిన అవసరం లేదని, అందచందాల తోనూ పనిలేదని, అర్థం చేసుకునే మంచి మనసు ఒక్కటుంటే సరిపోతుందని తెలిపింది.
డేటింగ్ వ్యవహారం.. నాకే తెలియకుండా!!
ఇకపోతే గతకొంతకాలంగా త్రిష డేటింగ్ లో ఉందనే వార్తలపై కూడా రియాక్ట్ అయింది త్రిష. ఆ విషయం నాకు ఇంత వరకూ తనకే తెలియదని, తనకు తెలియకుండా డేటింగ్లో ఉన్నానేమో! అంటూ డేటింగ్ సంగతులను ఖండించింది ఈ చెన్నై సుందరి.
Recommended Video
కాదనుకున్న త్రిష..
చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో త్రిషను కన్ఫర్మ్ చేయగా ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ని తీసుకోవడం జరిగింది.