Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏమున్నాడ్రా బాబు.. బాక్సాఫీస్ లాంటి బాడీతో సిద్దమైన వరుణ్ తేజ్.. మెగా బాహుబలి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి హీరోలైనా సరే ఫిట్నెస్ తోనే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. సినిమా సినిమాకు సరికొత్తగా కనిపిస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఫిట్నెస్ లో హీరో వరుణ్ కూడా సరికొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోలను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. నెటిజన్లు కూడా విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
స్టోరీ సెలక్షన్ మారిపోయింది
యువ హీరో వరుణ్ తేజ్ ఎలాంటి సినిమా చేసినా కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఫిదా సినిమా నుంచి అతని స్టోరీ సెలక్షన్ మారిపోయింది. అతని హైట్ కు తగ్గట్లు ఫిట్నెస్ మెయింటైన్ చేసి సినిమాలు చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలతో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది.
సరికొత్త కిక్కిచ్చాడు
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దల కొండ గణేష్ సినిమా బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న రఫ్ లుక్కుతో కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి ఆడియెన్స్ కు సరికొత్త కిక్కిచ్చాడు.
ఏమున్నాడ్రా బాబు
ఇక ఇప్పుడు నెక్స్ట్ సినిమా గని కోసం అంతకు మించి అనేలా రెడీ అవుతున్నాడు. బాక్సర్ పాత్రలో కనిపిస్తుండడంతో వరుణ్ మొదటి సారి తన బాడీని అప్‌గ్రేడ్ చేశాడు. చూడగానే ఏమున్నాడ్రా బాబు అనేలా ఆకట్టుకుంటున్నాడు. జిమ్ ముందు అలా బయటకు వెళ్ళగానే ఒక కెమెరెమెన్ తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video
మెగా బాహుబలి
మెగా బాహుబలి అంటూ వరుణ్ తేజ్ పై అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక గని సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కొన్ని నెలల పాటు విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.