For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Seetimaarr 6 Days collections: ఆరో రోజు పుంజుకుందిగా.. లెక్కలు మామూలుగా లేవు?

  |

  గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఎలా అయినా సరే ఈసారి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో గతంలో తనకు ఒక ఫ్లాప్ ఇచ్చాడు అన్న విషయం తెలిసి కూడా సంపత్ నంది ని నమ్మి మరోసారి అవకాశం ఇచ్చారు గోపీచంద్.

  ఈ నేపథ్యంలో గోపి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించబడిన సినిమా సిటీ మార్. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే మూడో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ కనిపించింది. మరి ఆరో రోజు పరిస్థితి ఎలా ఉంది ? సిటీ మార్ సినిమా మొత్తంగా ఆరు రోజులకు గాను ఎంత వసూలు చేసింది ? అనే విషయాన్ని పరిశీలిస్తే

  Pavani Ash: అదిరే అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ ..వీపు అందాలతో విరహపు వల!

  మంచి పాజిటివ్ టాక్

  మంచి పాజిటివ్ టాక్

  గోపీచంద్ తమన్నా దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించబడిన సినిమా సిటీ మార్. ఈ సినిమాకి యూ టర్న్ దర్శకుడు పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరించగా శ్రీనివాస చిత్తూరు ఈ సినిమాను నిర్మించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద రూపొందించబడిన ఈ సినిమాలో చాలా మంది కీలక నటీనటులు నటించారు. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి నటీనటులు కీలక పాత్రలలో నటించగా వర్మ స్కూల్ నుంచి వచ్చిన అప్సరా రాణి పెప్సీ ఆంటీ అనే ఒక సాంగ్ తో దుమ్ముదులిపేసింది. మొదటి ఆట నుంచి కూడా సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.

  Anchor Manjusha: ఉల్లిపోర లాంటి డ్రెస్‌తో అందాల విందు.. గ్లామర్ ట్రీట్‌లో ఎక్కడ తగ్గట్లేదుగా!

  ప్రీ రిలీజ్ ఇలా

  ప్రీ రిలీజ్ ఇలా

  అయితే గోపీచంద్ మార్కెట్ విషయానికి వస్తే ముందు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో గోపి మార్కెట్ తక్కువ అనే చెప్పాలి. లౌక్యం తర్వాత సరైన హిట్ పడకపోవడంతో ఆయన మార్కెట్ కూడా పెద్దగా ఎదగలేదు. అయితే గోపీచంద్ మార్కెట్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకు నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక తో పాటు మిగతా ఇండియా మొత్తం మీద 50 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పచ్చు.

  నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  ఎక్కడెక్కడ ఎంతంటే

  ఎక్కడెక్కడ ఎంతంటే

  ఇక ఆరో రోజు కూడా సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ బాగా కనిపించింది. ఇక అరవ రోజున సినిమాకి నైజాంలో రూ.9 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ.5 లక్షలు, కృష్ణాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలతో.. రూ. 0.43 కోట్లు షేర్, రూ.0.76 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న ‘సీటీమార్' మూడు రోజులకు కలిపి నైజాంలో రూ. 2.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.04 లక్షలు, ఈస్ట్‌లో రూ. 82 లక్షలు, వెస్ట్‌లో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలతో.. రూ. 7.89 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  డ్రాప్స్ ఉన్నా కానీ

  డ్రాప్స్ ఉన్నా కానీ

  భారీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘సీటీమార్'కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు 2.98 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే రీతిలో రూ. 1.74 కోట్లు రాబట్టడంతో ఆదివారం వీకెండ్ మరింత పెరుగుతుందన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా రూ. 1.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు వీక్ డే కావడంతో కలెక్షన్స్ లో 55 శాతం డ్రాప్ కనిపించి కేవలం 72 లక్షలు వసూలు చేసింది. ఇక ఐదో రోజు 51 లక్షలు కాగా ఆరవ రోజు 43 లక్షలు కలెక్ట్ చేసింది. 5 వ రోజు 51 లక్షలతో పోలిస్తే 6 వ రోజు కేవలం 8 లక్షల రేంజ్ లోనే సినిమా డ్రాప్ రావడం సాలిడ్ హోల్డ్ అని చెప్పాలి.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
  బ్రేక్ ఈవెన్ టార్గెట్?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.6.95కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ ‘సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నానలుగు రోజుల్లో రూ.8.27కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అమెరికా మినహా [ప్రపంచ వ్యాప్తంగాసినిమా 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా చెబుతున్నారు, నాలుగు రోజుల్లో రూ. 8.27 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 3.73 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ అని ట్రేడ్ వర్గాల వారు కూడా నిర్ధారించే అవకాశం ఉంటుంది.

  English summary
  Tollywood Talented Hero Gopichand and Sampath Nandi Seetimaarr Movie Released Last Friday, Movie Collected 6.95 Cr in 6 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X