For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajamouliకి షాక్ ఇచ్చిన ప్రభాస్.. నా చేతుల్లో ఏం లేదంటూ.. తెగించి వెళ్ళినా కష్టమే!

  |

  టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల రిలీజ్ డేట్ల టెన్షన్ నెలకొంది అని చెప్పక తప్పదు. నిజానికి ఒక రకంగా ఇదే రకమైన పరిస్థితి ఫస్ట్ వేవ్ పూర్తయిన తర్వాత కనిపించింది. కరోనా మొదటి వేవ్ పూర్తయిన తర్వాత ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాలు చేస్తున్నారో అన్ని సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ లను ఒక్కసారిగా ప్రకటించారు.

  అయితే కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో సెకండ్ వేవ్ రావడం మళ్ళీ థియేటర్లు మూత పడటంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ డేట్ల టెన్షన్ పట్టుకుంది. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కుతున్న అన్ని సినిమాలు ఇప్పుడు దాదాపు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ రాజమౌళికి షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  సన్నిహిత సంబంధాలు

  సన్నిహిత సంబంధాలు

  ప్రభాస్ రాజమౌళి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ తో ఛత్రపతి లాంటి సినిమా చేయడమే కాక బాహుబలి లాంటి సినిమా చేసి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మార్చడమే కాక ప్రపంచంలో కూడా ప్రభాస్ కి ఒక గుర్తింపు తెచ్చి పెట్టిన ఘనత రాజమౌళి కే దక్కుతుంది. అలాంటి ప్రభాస్ రాజమౌళికి షాక్ ఇవ్వడం ఏమిటి? అనే అనుమానాలు మీ అందరికీ కలగక మానవు. అయితే ప్రభాస్ రాజమౌళి ఇచ్చిన షాక్ ఏంటి ? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది పరిశీలిద్దాం.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  ఆర్ఆర్ఆర్ కోసం

  ఆర్ఆర్ఆర్ కోసం

  ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఒలీవియా మోరిస్ అలియా భట్ హీరోయిన్లుగా అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి ఎందరో టాప్ నటులతో ఒక భారీ బడ్జెట్ తో కూడిన సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనే కాక కొన్ని విదేశీ భాషల్లో సైతం విడుదల కాబోతోంది.

  ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా బాలీవుడ్ కి సంబంధించిన ఒక సంస్థ కొనుక్కోవడం, అవి కూడా వందల కోట్ల రూపాయల మేర ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

  రాధేశ్యామ్ వెనక్కి తగ్గాలాని

  రాధేశ్యామ్ వెనక్కి తగ్గాలాని

  అలాగే ప్రభాస్ కూడా రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జిల్ అనే సినిమా చేసిన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కృష్ణంరాజు, మురళి శర్మ అలాగే మరి కొందరు కీలక నటీ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. వాస్తవానికి సాహో సినిమా రిలీజ్ అయి నేటికి రెండేళ్ళు పూర్తి కావస్తున్నాయి. సాహో సినిమా పూర్తి అయిన వెంటనే మొదలు పెట్టిన ఈ సినిమా మాత్రం రిలీజ్ ఎప్పుడు అనే విషయం మీద మొన్నటిదాకా సందిగ్ధావస్థలో ఉండాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం ఈ సినిమాని ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు.

  సంక్రాంతికి రావాలంటూ

  సంక్రాంతికి రావాలంటూ

  ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అక్టోబర్ 13 వ తేదీ 2021 వ సంవత్సరం లో విడుదల చేస్తామని ప్రకటించారు.. అయితే అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ కూడా రావడంతో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు దాదాపుగా ఆ తారీఖున రావడం అసాధ్యం.. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలని రాజమౌళి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మిగతా సినిమా యూనిట్లతో మాట్లాడుతూ కుదిరితే సినిమా వాయిదా వేసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  తిరస్కరించిన ప్రభాస్

  తిరస్కరించిన ప్రభాస్

  అందులో భాగంగానే ప్రభాస్ రాధేశ్యామ్ యూనిట్ ని కూడా రాజమౌళి సినిమా వాయిదా వేసుకోమని ప్రభాస్ టీమ్ ద్వారా కోరగా ప్రభాస్ కాస్త ఇబ్బంది పడుతూనే ఈ సినిమాని ఇప్పుడు వాయిదా వేసే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి ఒకసారి కోరగా ప్రభాస్ ఈ సినిమా వాయిదా వేశారు. అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రభాస్-రాజమౌళి కోరిన వెంటనే ప్రభాస్ అందుకు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభాస్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది ఇప్పుడు ఎలా అయినా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాకపోతే ప్రేక్షకులు కచ్చితంగా అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..

  Recommended Video

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
  కష్టమే

  కష్టమే

  అందుకే ప్రభాస్ ఏం చేయాలో తెలియక ఈ సినిమా రిలీజ్ విషయంలో తాను ఏమీ చేయలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. సౌమ్యంగానే చెప్పాడని అంటున్నా సరే రాజమౌళి మాట కాదు అనడం అనే పాయింట్ ఇప్పుడు ఇక్కడ హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ఎందుకంటే ఈ రాధేశ్యాం సినిమాని నిర్మించేది కూడా ప్రభాస్ స్నేహితుల సంస్థ కాబట్టి. అయినా సరే ప్రభాస్ మాత్రం ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్పేయడంతో రాజమౌళి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభాస్ కాకుండా వేరే వాళ్ళు వెనక్కి తగ్గినా ప్రభాస్ హిందీ మార్కెట్ కారణంగా సినిమాని అప్పుడు విడుదల చేయడం కష్టమే అని అంటున్నారు.

  English summary
  As per reports Prabhas politely denies Rajamouli Request for Sankranthi Release, since they had considered his request earlier and postponed once. Radhe Shyam Team stick to Sankranti 2022 release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X