twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ స్కెచ్.. పకడ్బందీ ప్లాన్‌తో రెడీ!

    |

    సినీ ఇండస్ట్రీలోని నటీనటులపై, దర్శకనిర్మాతలపై నిత్యం ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబినేషన్స్ విషయంలో అయితే రకరకాలుగా రూమర్స్ పుట్టిస్తుంటారు కొందరు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్- మహేష్ బాబు విషయమై కొనసాగుతున్న కొన్ని రూమర్స్‌కి చెక్ పెట్టాలని ప్లాన్ చేశారట డాషింగ్ డైరెక్టర్ పూరి. ఇంతకీ ఆ రూమర్స్ ఏంటి? అలాగే ఆయన ప్లాన్ ఏంటి? వివరాల్లోకి పోతే..

    హిట్ ట్రాక్ ఎక్కిన పూరి..

    హిట్ ట్రాక్ ఎక్కిన పూరి..

    టెంపర్ సినిమా తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఈ సినిమాలో ఆయనిచ్చిన మాస్ కిక్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దీంతో మరోసారి అందరి చూపు పూరిపై పడింది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ రూపొందిస్తున్నారు.

    స్టార్ హీరోతో ఆ రెండు సినిమాలు..

    స్టార్ హీరోతో ఆ రెండు సినిమాలు..

    పూరి జగన్నాథ్- మహేష్ బాబు లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా తెలుగు సినిమా లోకం ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుంచారు. మొదట 'పోకిరి' ఆ తర్వాత 'బిజినెస్‌మెన్' భారీ హిట్స్ సాధించి భేష్ అనిపించుకున్నారు.

    ఆ హీరోతో అభిప్రాయ బేధాలు.. అందుకే పూరి!

    ఆ హీరోతో అభిప్రాయ బేధాలు.. అందుకే పూరి!

    అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో పూరి డ్రీమ్ ప్రాజెక్టు 'జనగణమన' కాస్తుందని వార్తలు షికారు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో పూరిని ఫ్లాప్స్ వెంటాడటంతో పూరి జగన్నాథ్- మహేష్ కాంబో సెట్ కాలేదని వార్తలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వాచ్చాయని, అందుకే ఈ కాంబో సెట్ కాలేదని విన్నాం.

     అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ ప్లాన్

    అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ ప్లాన్

    అయితే అవేవి నిజం కాదని నిరూపించాలని పూరి జగన్నాథ్ బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ పకడ్బందీ ప్లాన్‌తో రెడీ అయ్యారట. వెంటనే మహేష్ బాబుతో ఓ సినిమాను సెట్ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా రెడీ చేశారట ఈ డాషింగ్ డైరెక్టర్. మహేశ్ ఓకే అంటే కథ వినిపించేందుకు రెడీగా ఉన్నారనేది లేటెస్ట్ సమాచారం.

    Recommended Video

    Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
    సూపర్ స్టార్ బిజీ.. ఇంతకీ ఎప్పుడు?

    సూపర్ స్టార్ బిజీ.. ఇంతకీ ఎప్పుడు?

    పూరి జగన్నాథ్- మహేష్ కాంబో రిపీట్ కానుందనే వార్తలు రావడమే ఆలస్యం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అనే కుతూహలం నెలకొంది ప్రేక్షకుల్లో. అయితే ఇప్పటికే పరశురామ్, వంశీ పైడిపెల్లి లాంటి దర్శకులను లైన్‌లో పెట్టిన మహేష్ ఆయా ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నారు. సో.. పూరికి ఎప్పుడు డేట్స్ సెట్ చేస్తారో చూడాలి మరి.

    English summary
    Puri Jagannadh's ismart shanker hits box office. Then he is with fighter movie. As per latest talk once again Puri Jagannadh- Mahesh babu hit combo will be repeat shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X