Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వాడిలా, వీడిలా కాదు.. డబ్బు, రెస్పెక్ట్ కావాలి: పచ్చిగా మాట్లాడిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ మనసులో నుంచి వచ్చే మాటలు చాలా జెన్యూన్‌గా ఉంటాయని చాలా మంది అంటుంటారు. కల్పితాలు మాట్లాడకుండా మనసులోని విషయాలను నిక్కచ్చిగా చెప్పే ఈ యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ తాజాగా మరోసారి పచ్చిగా మాట్లాడి ఆకట్టుకున్నారు.
సింగ్నేచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విజయ్... ఇటీవల మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను ఎవరినో చూసి ఇన్స్‌స్పైర్ అయి సినిమా రంగం వైపు రాలేదని, తన సమస్యలే తనను డబ్బు బాగా సంపాదించే ఈ రంగం వైపు వెళ్లేలా మోటివేట్ చేశాయన్నారు.

డబ్బు, రెస్పెక్ట్ కావాలి
మనకు లైఫ్‌లో డబ్బులు కావాలి, ఇంటికి రెంటు కావాలి, ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్లినపుడు రెస్పెక్ట్ కావాలి... నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రోత్సహించింది ఈ సమస్యలే. వీడిలా ఉండాలి వాడిలా ఉండాలి అని కాకుండా మనకు అవసరమైనవి, మనం కోరుకున్న జీవితం సాధించుకోవాలి అని కసిపెరిగింది. మన లైఫ్ కంటే ఏదీ మనల్ని మోటివేట్ చేయలేదు.. అని విజయ్ దేవరకొండ అన్నారు.
హిందీలో గీతా గోవిందం రీమేక్.. హీరో ఎవరంటే..

ఇక్కడ డబ్బు, పేరు రెండు లభిస్తాయి.. అందుకే
నాకు సినిమా రంగం అంటే నచ్చింది. ఇందులో డబ్బుతో పాటు పేరు సంపాదించవచ్చు. ఇక్కడ అవేమీ లేకపోతే దీన్ని ఎంచుకునేవాడిని కాదు. నేను కోరుకున్న జీవితం ఎంజాయ్ చేస్తూ డబ్బు, పేరు సంపాదించుకునే వీలు ఉంది కాబట్టే ఇటు వైపు వచ్చానని విజయ్ స్పష్టం చేశారు.

వాళ్లని చూస్తే భయం వేస్తుంది
ఇండస్ట్రీలో అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారిని చూసినపుడు భయం వేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అదే ప్లేసులో ఉన్నవాడినే. అక్కడ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసన్నారు.

మళ్లీ అక్కడికి వెళ్లాలని కోరుకోను
ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ మన దశ తిరుగుతుందని నమ్మంతో ఎదురు చూడటం, ఎవరో ఆఫర్ ఇస్తారు అనే ఆశతో, కష్టాలు అనుభవిస్తూ సర్వైవ్ అవ్వడం అంత సులభం కాదు. అది కంఫర్టబుల్ ప్లేసు కానేకాదు. మళ్లీ ఎప్పుడూ ఆ ప్లేసుకు వెళ్లాలని కోరుకోను అని విజయ్ చెప్పుకొచ్చారు.

విజయ్ దేవరకొండ
ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్' అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.