twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్‌స్టార్‌పై కుట్ర చేశాను.. సిల్క్ స్మిత, అతడితో కలిసి.. అలా మోసం చేశా.. తమ్మారెడ్డి

    |

    తమ్మారెడ్డి భరద్వాజా పక్కగా ముక్కుసూటి మనిషి. తాను నమ్మిన దాని కోసం వెనకడుగు వేయని వ్యక్తి. అలాంటి దర్శకుడైన తమ్మారెడ్డి కృష్ణ గారితో పచ్చని సంసారం అనే సూపర్ హిట్ సినిమా తర్వాత రౌడీ అన్నయ్య మూవీని తీశారు. ఆ సినిమా సమయంలో ఓ పాట విషయంలో కృష్ణకు, తమ్మారెడ్డికి విభేదాలు తలెత్తాయి. పక్కగా ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేసే కృష్ణకు చెప్పకుండా తమ్మారెడ్డి ఓ నిర్ణయం తీసుకొని చిన్నపాట కుట్ర చేశారు. ఆ కుట్ర, మోసం ఏమిటంటే..

    పాటతో సమస్య వచ్చింది

    పాటతో సమస్య వచ్చింది

    తెలుగు సినిమా పరిశ్రమలో పచ్చని సంసారం నాకు కమ్‌బ్యాక్ మూవీ. కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆయనతోనే మరో సినిమా చేయాలనుకొన్నాను. కృష్ణ సూచన మేరకు రౌడీ అన్నయ్య సినిమా ప్రారంభించాం. ఆ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి సత్యానంద్ రచయిత. ఆ చిత్ర షూటింగ్ అంతా సవ్యంగా సాగింది. కానీ ఓ పాట సమస్య తెచ్చిపెట్టింది. అసలేం సమస్య తెచ్చిపెట్టిందంటే..

    బాబుమోహన్, సిల్క్ స్మితపై పాట

    బాబుమోహన్, సిల్క్ స్మితపై పాట

    క్లైమాక్స్‌కు ముందు వచ్చే పాటలో సిల్క్ స్మిత, బాబూ మోహన్‌పై పాట షూట్ చేయాలి. స్మిత అంటే బాబూమోహన్‌కు చెప్పలేనంత ఇష్టం. బాబూ మోహన్ వద్ద ఓ సీక్రెట్ ఉంటుంది. అతడితో డ్యాన్స్ చేసి స్మిత ఆ సీక్రెట్‌ను తెలుసుకోవాలి. ఆ సందర్భంలో వచ్చే పాటలో కృష్ణ నేను కూడా ఉంటానని అన్నాడు.

    <strong>తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్‌</strong>తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్‌

    కృష్ణను వద్దని వారించాను

    కృష్ణను వద్దని వారించాను

    అయితే సూపర్‌స్టార్ కృష్ణ ఆ పాటలో నటిస్తే ఆయన హోదాకు తగినట్టు ఉండదని భావించాను. వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తే మధ్యలో మీరు ఉంటే బాగుండదు అని చెప్పాను. అదే విషయాన్ని చెబితే కాదు.. కుదరదు అన్నాడు. దాంతో ఆ పాటను ఉదయం కృష్ణ, సాయంత్రం బాబూమోహన్‌తో తీద్దామని నిర్మాతకు చెప్పాను. దాంతో పాట చిత్రీకరించే బాధ్యతను డ్యాన్స్ డైరెక్టర్, నిర్మాతకు అప్పగించి నేను మద్రాస్‌కు వెళ్లిపోయాను.

    కృష్ణకు తెలియకుండానే

    కృష్ణకు తెలియకుండానే

    సూపర్‌స్టార్ కృష్ణకు తెలియకుండా ఆ పాటను బాబూమోహన్, స్మితపై షూట్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే ఉదయం కృష్ణ, సిల్క్ స్మితపై, రాత్రి బాబూమోహన్, కృష్ణపై షూట్ చేశాం. అలా చేసింది నిర్మాతనే. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

    సెన్సార్ ఇబ్బందులతో బయటకు

    సెన్సార్ ఇబ్బందులతో బయటకు

    పాట పూర్తయిన తర్వాత బాబూమోహన్, సిల్క్ స్మిత పాటను సినిమాలో పెట్టి సెన్సార్‌కు పంపించాం. ఆ పాటను చూసి సెన్సార్ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఆ విషయం కృష్ణకు తెలిసింది. దాంతో సెన్సార్ బోర్డు అధికారిగా ఉన్న సుబ్బిరామిరెడ్డితో అమీ తుమీ తెల్చుకొనేందుకు కృష్ణ సిద్ధమయ్యారు.

    కృష్ణ మనస్తాపంతో

    కృష్ణ మనస్తాపంతో

    పాటపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం తప్పని సుబ్బిరామిరెడ్డితో కృష్ణ వాదన పెట్టారు. అయితే ఆ పాట అశ్లీలంగా ఉంది. కావాలంటే నీవు చూడు అని ఆ పాటను కృష్ణకు చూపించారు. తన పాటకు బదులు బాబూమోహన్ పాట ఉండటంతో కృష్ణ మనస్తాపం చెందారు.

    మా మధ్య ఫ్రెండ్ షిప్ కట్

    మా మధ్య ఫ్రెండ్ షిప్ కట్

    సెన్సార్ బోర్డు ఆఫీస్‌లోని థియేటర్ నుంచి కృష్ణ నేరుగా బయటకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక నుంచి నాకు నీకు మధ్య ఫ్రెండ్ షిప్ కట్ అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్మితతో మళ్లీ కృష్ణగారు పాటను షూట్ చేశారు. దాంతో సిల్క్ స్మిత ఒకే పాటలో మూడుసార్లు నటించింది. స్మిత మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు.

    కృష్ణ గారే కరెక్టని భావించా

    కృష్ణ గారే కరెక్టని భావించా

    అప్పటి నుంచి చాలా రోజుల వరకు నాకు, కృష్ణగారికి మాటలు లేవు. ఆ తర్వాత కృష్ణపై చిత్రీకరిస్తే బాగుండేదని అనిపించింది. ఇటీవల అత్తారింటికి దారేదిలో బ్రహ్మనందంపై తీసిన పాటలో పవన్ కల్యాణ్ ఉండటంతో కృష్ణ గారి వాదనే కరెక్ట్ అనిపించింది.

    English summary
    Tamma Reddy Bhardwaja revealed about superstar Krishna while shooting Rowdy Annayya movie. Bhardwaja said that, he was confronted opinion of Krishna a song with Silk Smitha. But finally Krishna shot the song and made movie hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X