twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరెంజ్ నష్టాలకు అతడే కారణం.. పవన్, అన్నయ్య లేకపోతే.. ఆ నిర్ణయం.. నాగబాబు

    |

    టాలీవుడ్‌లో మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడే కాదు, విలువలతో కూడిన వ్యక్తి. ఒకప్పుడు ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ఆయన నైజం. అదే ఆరెంజ్ సినిమా నిర్మాణం దెబ్బ తీసింది. గతంలో రాంచరణ్ హీరోగా ఆరెంజ్ అనే చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో నాగబాబు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆరెంజ్ తర్వాత పరిస్థితులను వెల్లడించిన విషయాలు మీ కోసం..

    డైరెక్టర్‌ను నమ్ముకోవడం వల్లనే

    డైరెక్టర్‌ను నమ్ముకోవడం వల్లనే

    ఆరెంజ్ సినిమా కష్టాల గురించి ఇప్పుడు చెప్పడం సరికాదు. కాకపోతే డైరెక్టర్ నమ్ముకోవడం వల్ల నాకు నష్టాలు వచ్చాయి. ఆరెంజ్ సినిమా రిలీజ్ తర్వాత నేను నష్టపోయిన మొత్తం తెలిసి షాక్ అయ్యాను. ఎదురైన పరిస్థితి ఎన్నడూ ఊహించలేనిది. అనుభవించలేనిది. నా ఆస్తులన్నీ అమ్మినా నా అప్పులు తీర్చలేనిదిగా ఉండేది అని నాగబాబు అన్నారు.

    ఆరెంజ్ ఫెయిల్యూర్ కాదు

    ఆరెంజ్ ఫెయిల్యూర్ కాదు

    అయితే అరెంజ్ సినిమా ఫెయిల్యూర్ కాదు. బిజినెస్ కూడా ఫెయిల్యూర్ కాదు. కానీ అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. నేను లెక్కలు చూసుకోవడం తప్పని తెలిసింది. అయితే నా తప్పులను నుంచి బయటపడి నా గురించి నేను తెలుసుకొన్నాను. తమ్ముడు, అన్నయ్యలపై ఆధారపడకుండా నేను టెలివిజన్‌లో నా కెరీర్‌పై దృష్టిపెట్టాను. జబర్దస్త్, ఇతర సీరియళ్లు నాకు మంచి పేరు, డబ్బును ఇచ్చాయి.

    వరుణ్ తేజ్ మెగా విరాళం: పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ సపోర్ట్, కోట్ల రూపాయలు..వరుణ్ తేజ్ మెగా విరాళం: పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ సపోర్ట్, కోట్ల రూపాయలు..

    పవన్ కల్యాణ్, చిరంజీవి సపోర్ట్

    పవన్ కల్యాణ్, చిరంజీవి సపోర్ట్

    అలాంటి కష్టాల్లో ఉన్నప్పడు నా తమ్ముడు పవన్ కల్యాణ్ బాగా సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నయ చిరంజీవి. వారిద్దరు రియాక్ట్ కావడంలో ఒకట్రెండు రోజులు తేడా మాత్రమే. జీవితంలో స్నేహితులను బాగా నమ్ముతాం. కానీ నా లైఫ్‌లో ఎప్పుడూ నా సోదరులే నాకు ప్రాణం.

    ఆరెంజ్ సినిమా నష్టాలతో

    ఆరెంజ్ సినిమా నష్టాలతో

    అరెంజ్ వల్ల ఏర్పడిన నష్టాలతో ఆఫీస్ కూడా లేకపోయింది. కాఫీ షాప్‌కు వచ్చి ఫ్రెండ్స్, అప్పులిచ్చిన వాళ్లతో మాట్లాడే వాడిని. కష్టాలు, సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో అనే విషయాన్ని తెలుసుకొన్నాను. జీవితంపై పూర్తిగా అవగాహన ఏర్పరుచుకొన్నాను.

    అఘాయిత్యం చేసుకోవాలనే

    అఘాయిత్యం చేసుకోవాలనే

    కష్టాలు వచ్చినప్పుుడు వాటికి లొంగిపోకూడదు. సమస్యలను ఎదురించే స్థితికి చేరుకోవాలే. ఒకవేళ లొంగిపోయామో అది మనల్ని మింగేస్తుంది. ఎదురుతిరిగితే పరిష్కారాలు వస్తాయి. ఓ దశలో అఘాయిత్యం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. క్షణికావేశానికి లోనయ్యాను.

    కష్టాల్లో ఉన్నప్పడు యుద్దం చేయాలి

    కష్టాల్లో ఉన్నప్పడు యుద్దం చేయాలి

    కష్టాల్లో ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. యుద్దంలో ఓడిపోయామని నిర్ణయించుకొన్న తర్వాతే ఏదైనా అంతిమ నిర్ణయం తీసుకోవాలి. క్షణికావేశానికి లోనుకాకూడదు. పవన్ కల్యాణ్, అన్నయ్య అండగా నిలిచిన తర్వాత లక్కీగా నాకు పరిస్థితులు సానుకూలంగా మారాయి. నేను వెనుకకు తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్, సీరియళ్లు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాయి అని నాగబాబు తెలిపారు.

    English summary
    Mega Brother Nagababu recalls the bad days of Orange movie in latest interview. He said, Over trust of his nature reasons for the troubles. He said, Pawan Kalyan, Chiranjeevi have given support to come out from the financial Issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X