twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda 46 Days Collections: ఆదివారం అఖండకు రికార్డు కలెక్షన్లు.. ఆ హీరోలకు షాకిచ్చిన బాలయ్య

    |

    సుదీర్ఘ కాలంగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు తెలుగు స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, కావాల్సిన హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూడోసారి జతకట్టారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు.

    ఎన్నో అంచనాల మధ్యన గత డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే దీనికి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఇది తక్కువ టైంలోనే టార్గెట్‌ను చేరుకుంది. అలా ఎనిమిది వారాలుగా సత్తా చాటుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 46వ రోజు కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

    అఖండగా బాలయ్య విశ్వరూపం

    అఖండగా బాలయ్య విశ్వరూపం

    నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమే 'అఖండ'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.

    హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

    అఖండ ప్రీ బిజినెస్ జరిగిందిలా

    అఖండ ప్రీ బిజినెస్ జరిగిందిలా

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా బాలయ్యకు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకే దీన్ని భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    46వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

    46వ రోజు ఇక్కడ ఎంత రాబట్టింది?

    భారీ విజయం కోసం చాలా కాలంగా వేచి చూస్తోన్న బాలయ్య నటించిన 'అఖండ' మూవీకి ఆరంభంలో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, సంక్రాంతి మూడు రోజులూ ఈ మూవీ బాగా పుంజుకుంది. మరీ ముఖ్యంగా ఆదివారం ఇది హవా చూపించింది. దీంతో 46వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 21 లక్షలు వసూలు చేసేసింది.

    Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!

    46 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    46 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    'అఖండ'కు 46 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.25 కోట్లు, గుంటూరులో రూ. 4.77 కోట్లు, కృష్ణాలో రూ. 3.66 కోట్లు, నెల్లూరులో రూ. 2.64 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 62.56 కోట్లు షేర్, రూ. 104 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఆంధ్రా, తెలంగాణలో హవా చూపించిన 'అఖండ' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 46 రోజుల్లో రూ. 62.56 కోట్లు అందుకున్న ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.07 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.71 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.24 కోట్లు షేర్, రూ. 129 కోట్లు వసూలు చేసేసింది.

    బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 46 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.34 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 19.34 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

    సంక్రాంతి సినిమాలకు అఖండ షాక్

    సంక్రాంతి సినిమాలకు అఖండ షాక్

    'అఖండ' విడుదలై 46 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇది మంచి కలెక్షన్లనే రాబడుతోంది. మరీ ముఖ్యంగా కనుమ రోజు బాలయ్య సినిమా భారీ కలెక్షన్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులతో ఏకంగా రూ. 21 లక్షలు వసూలు చేసింది. తద్వారా సంక్రాంతికి విడుదలైన పలు చిత్రాలతో పాటు పుష్ప, శ్యామ్ సింగ రాయ్‌కు భారీ షాక్ ఇచ్చిందీ మూవీ.

    English summary
    Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. This Movie Collect Rs 73.34 Crores in 46 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X